దొరా నీ కాల్మొక్త.. అన్యాయం చేయొద్దు
కర్ణాటక: కృష్ణా అప్పర్ ప్రాజెక్టు కోసం తీసుకున్న తమ భూములకు తగిన పరిహారం ఇవ్వాలని బాగల్కోటలో పునర్వసతి కార్యాలయంలో ఓ మహిళ అక్కడ అధికారి కాళ్లుపట్టుకుంది. బాగల్కోటే లో కష్ణాఅప్పర్ ప్రాజెక్టు పనులు నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఏళ్లు గడిచినా పరిహారం అందలేదు.
ఈ నేపథ్యంలో నిర్వాసితులు బుధవారం బాగల్కోటే జిల్లా కార్యాలయాన్ని ముట్టడించారు. ఇందులో భాగంగా ఓ అధికారి కార్యాలయం బయటికి రాగానే మహిళలు దొరా నీ కాళ్లు మొక్కుతాము మాకు అన్యాయం చేయకండని ఆయన కాళ్లు పట్టుకున్నారు.