ఘాట్లను పరిశీలించిన పోలీస్ అధికారులు
విజయవాడ (భవానీపురం) :
కృష్ణా పుష్కరాల సందర్భంగా నగరంలో ఏర్పాటు చేస్తున్న పుష్కర ఘాట్లను పోలీస్ అధికారులు బుధవారం పరిశీలించారు. పోలీస్ కమిషనర్ డి.గౌతం సవాంగ్, జాయింట్ సీపీ హరికుమార్, డీసీపీ (అడ్మిన్) జి.వి.జి.అశోక్‌కుమార్, లా అండ్ ఆర్డర్ డీసీపీలు డాక్టర్ కోయ ప్రవీణ్, పాల్‌రాజ్, డీసీపీ (ట్రాపిక్) కాంతి రతన్‌టాటా, పుష్కరాల బందోబస్తుకు వచ్చిన పోలీస్ అధికారులు ఘట్లను పరిశీలించారు. పద్మావతి ఘాట్ నుంచి ఇబ్రహింపట్నంలోని సంగమం ఘాట్ వరకు సందర్శించారు. ఆయా ఘాట్ల వద్ద జరిగే పనులను పరిశీలించి పుస్కర యాత్రీకులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏఏ చర్యలు తీసుకోవాలి అన్న అంశంపై సమీక్షించారు.