పురం మార్కెట్ కమిటీ చైర్మన్గా క్రిష్టప్ప ప్రమాణస్వీకారం
హిందూపురం టౌన్ (అనంతపురం) : రాయలసీమలోనే పేరు ప్రఖ్యాతలు గాంచిన హిందూపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా లేపాక్షి మండలానికి చెందిన శిరివరం క్రిష్టప్ప, ఉపాధ్యక్షునిగా ఆదిరెడ్డి, కార్యవర్గ సభ్యులు శుక్రవారం ప్రమాణస్వీకారోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిందూపురం ఎంఎల్ఎ బాలకృష్ణ, పార్లమెంట్ సభ్యుడు నిమ్మల క్రిష్టప్ప, పెనుకొండ ఎంఎల్ఎ పార్థసారధి, చైర్పర్సన్ ఆర్.లక్ష్మి, వైస్ చైర్మన్ జెపికె రాము, మాజీ ఎంఎల్ఎ రంగనాయకులు, నాయకులు అంబికా లక్ష్మినారాయణ, నాగరాజు తదితరుల సమక్షంలో కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా క్రిష్టప్ప మాట్లాడుతూ.. నా మీద ఎంతో నమ్మకం ఉంచి నాకు ఈ పదవిని కట్టబెట్టిన ఎంఎల్ఎ బాలకృష్ణకు, స్థానిక నాయకులకు రుణపడి ఉంటానని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రైతు సంక్షేమానికి, వ్యాపారస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మార్కెట్ యార్డులో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను వెంటనే పరిష్కరించి రైతులకు అసౌకర్యాలు లేకుండా చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు దాదాపీర్, షాజియాబాను, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.