వర్ధన్నపేట కాంగ్రెస్ అభ్యర్ధి కే. శ్రీధర్ ఆత్మాహత్యాయత్నం!
వరంగల్: వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్ధి కే. శ్రీధర్ ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డారు. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన శ్రీధర్ పరిస్థితి విషమంగా మారడంతో ఆయన స్థానిక ఆస్పత్రికి తరలించారు.
శ్రీధర్ వర్ధన్నపేట్ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆర్ధికంగా చితికి పోయిన శ్రీధర్ ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేయలేకనే ఆత్మాహత్యాయత్నానికి ప్రయత్నించినట్టు వార్తలు వెలువడుతున్నాయి.
అంతేకాక ఆ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్ధి కూడా ముదంజలో ఉన్నాడని.. ఓటమి తప్పదనే కారణంతో ఆత్మహత్యాకారణమై ఉండవచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. అయితే శ్రీధర్ ఆత్మాహత్యాయత్నానికి ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదు.