ఏసీపీ సంజీవరావుపై సస్పెన్షన్ వేటు
హైదరాబాద్: ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన కూకట్పల్లి ఏసీపీ సంజీవరావుపై సస్పెన్షన్ వేటు పడింది. అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడుల్లో భారీగా అక్రమ ఆస్తులు బయటపడటంతో ఆయనను ఏసీబీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఉన్నతాధికారులు ...సంజీవరావును గురువారం సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా కూకట్ పల్లి కొత్త ఏసీపీగా భుజంగరావు నియమితులయ్యారు.
అక్రమంగా ఆస్తులు కూడబెట్టారన్న ఫిర్యాదుల నేపథ్యంలో అనినీతి నిరోధక శాఖ అధికారులు (ఏసీబీ) సంజీవరావు నివాసంతో పాటు, కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లపై ఏసీబీ సోదాలు జరిపింది. ఈ దాడుల్లో భారీ ఎత్తున నగదు, ఆస్తి పత్రాలు, లాకర్లలోని నగలను అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే.