ఆత్మహత్యల నివారణకు 'వన్ లైఫ్'
హైదరాబాద్‌సిటీ: జీవితంపై విరక్తి చెంది కొందరు.. క్షణికావేశానికిలోనై మరికొందరు.. పరీక్షలో ఫెయిలై ఇంకొందరు.. దేశంలో ప్రతి గంటకు 15 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. 2013లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 14,328 మంది ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. నిరాశతో, నిస్తేజంతో ఆత్మహత్యే పరిష్కారమని భావిస్తున్న వారిలో చిరు ఆశను రేకెత్తించి ఆత్మహత్యాయత్నం నుంచి వారిని కాపాడేందుకు 'వన్‌లైఫ్' స్వచ్చంధ సంస్థ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చింది.
రోజురోజుకు పెరుగుతున్న ఆత్మహత్యల నివారణ కోసం 7893078930 నెంబరుతో ఉచిత హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వన్‌లైఫ్ సంస్థ అధ్యక్షుడు కేవీఎస్ సూర్యనారాయణ వివరాలు వెల్లడించారు.