మలయాళ నటుడుతో తమిళ తార నాజ్రియా పెళ్లి!
ప్రముఖ దర్శకుడు ఫాజిల్ కుమారుడు, మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ తో తమిళ నటి నాజ్రియా పెళ్లి కుదిరింది. నాజ్రియా, ఫహద్ లిద్దరూ ఎల్ ఫర్ లవ్ అనే మలయాళ రొమాంటిక్ డ్రామా చిత్రంలో నటిస్తున్నారు. వీరిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించినట్టు తెలిసింది. దాంతో ఈ ఏడాది చివర్లో వీరిద్దరి పెళ్లికి ఏర్పాటు జరుగుతున్నాయి.
'ఫహద్ తో తన కూతురు వివాహం కుదిరింది. ఆగస్టు నెలలో పెళ్లికి జరిపించడానికి నిర్ణయం తీసుకున్నాం' అని నజ్రియా తండ్రి మీడియాతో అన్నారు. ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్ధం జరిగింది. తన నిశ్చితార్ధం వార్తను నజ్రియా సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. రాజా రాణి చిత్రంలో నజ్రియా నటించింది. ఫహద్ ఇప్పటి వరకు 12 చిత్రాల్లో నటించారు.