రామోజీ ఫిలింసిటీ కార్మికుల ధర్నా
హైదరాబాద్: కార్మికులకు,కార్మికశాఖకు వ్యతిరేకంగా రామోజీ ఫిల్మ్‌సిటీ యాజమాన్యం తెచ్చుకున్న స్టేను ఎత్తివేయించడంలో కార్మికశాఖ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రామోజీ ఫిల్మ్‌సిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం ఆర్టీసీ క్రాస్‌రోడ్డు సమీపంలోని కార్మికశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు.
ఫిల్మ్‌సిటీ యాజమాన్యం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. జీవో నంబర్ 63ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వేతనాల పెంపు, ఉద్యోగభద్రత తదితర న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. రామోజీ ఫిలింసిటీలో పనిచేస్తున్న కార్మికులపై యాజమాన్యం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు. కార్మికశాఖ అధికారులు, ప్రభుత్వ న్యాయవాదులు ఫిల్మ్‌సిటీ యాజమాన్యానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.