టీటీడీలో నకిలీ లడ్డూ టిక్కెట్ల కుంభకోణం
శ్రీవారి ఆలయంలో నకిలీ లడ్డూ టిక్కెట్ల కుంభకోణాన్ని టీటీడీ ఉన్నతాధికారులు మంగళవారం ఉదయం గుట్టురట్టు చేశారు. నకిలీ టికెట్ల ద్వారా లడ్డూలను విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అందులోభాగంగా దాదాపు 210 నకిలీ కలర్ జిరాక్స్ టిక్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ లడ్డూ టిక్కెట్ల వ్యవహరంపై విచారణ జరిపాలని విజిలెన్స్ అధికారులను టీటీడీ ఆదేశించింది.
శ్రీవార దర్శనం కోసం వచ్చిన భక్తులతో తిరుమలలో రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు కనులారా వీక్షించేందుకు భక్తులు 15 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. అలాగే శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతుంది.