అందమైన అధరాల కోసం 3డీ రెడ్ లిప్స్టిక్
లండన్: `లిప్స్టిక్` అనగానే గుర్తుచ్చేది అమ్మాయి అందమైన అధరాలు. ఆ అమ్మాయి అధరాలకు కాస్తా లిప్ స్టిక్ తోడైతే ఆమె అందానికి మరింత అందం తెచ్చిపెడుతుంది. చక్కని ముద్దుగుమ్మ లేతపెదవలపై ఎర్రటి రంగు లిప్ స్టిక్ చూస్తే ఎంతటివారైనా చూపుతిప్పుకోవటం కష్టమే మరీ. అయితే మహిళల అలంకరణ వస్తువుల్లో లిప్ స్టిక్ ది తొలిస్థానమనే చెప్పాలి. అతివలు తమ అందం కోసం ఎంతగా మేకప్ చేసుకొన్నా చివరికి పూర్తి అయ్యేది లిప్ స్టిక్ తోనే మరీ. అతివల మదిని దోచుకునే ఎన్నో లిప్ స్టిక్ లు ప్రస్తుత మార్కెట్లో విభన్నరీతిలో లభ్యమవుతున్నాయి. వీటిన్నింటికీ భిన్నంగా అమ్మాయిలను మరింత అందంగా చూపించేందుకు మరో సరికొత్త లిప్ స్టిక్ అందుబాటులోకి వచ్చింది. అదే `3డీ రెడ్ లిప్స్టిక్`.
సాధారణంగా అమ్మాయిలందరూ తమ అధరాలను అందంగా తీర్చిదిద్దేందుకు లిప్ స్టిక్, లిప్ గ్లాస్ వంటి వాడుతుంటారు. వివిధ ఫంక్షన్లు, మరియు చాలా ఈవెంట్స్ లలో చాలా మంది సెలబ్రెటీ రెడ్ లిప్ స్టిక్ వేసుకొని ఉండటాన్ని మనం గమనించే ఉంటాం. కానీ 3డీ రెడ్ లిప్స్టిక్ వేసుకున్న మహిళలు ఇంకా అందంగా కనిపించేలా ఇందులో మూడు రకాల షేడ్స్ ఉన్నాయి. దీంతో వారి పెదవులు త్రిడీ లూక్ లో ప్రకాశిస్తాయి. అయితే ఈ రెడ్ లిప్ స్టిక్ ను సరైన పద్దతిలో మేకప్ వేసుకున్నట్టయితే ఎంతో అందంగా కనిపిస్తారు. ఈ రెడ్ లిప్ స్టిక్ మొదట పెదవుల మధ్య పొరపై సున్నితంగా రాసి, ఆపై పెదవుల అంచులలో డార్క్ గా మేకప్ వేసినట్టయితే ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయని ఫిమేల్స్ ఫస్ట్. కో. యుకె నివేదించింది. ఒకే రంగుతో పెదవులకు ఈ రెడ్ లిప్ స్టిక్ వేసుకున్నసరే ఇంకా ఆకర్ణణీయంగా కనిపిస్తుందని పేర్కొంది. ఎందుకంటే ఈ రెడ్ లిప్ స్టిక్ వేసుకొనే విధానంలో కొన్ని ట్రిక్స్ తెలుసుకొన్నట్లైతే మీరు అందంగా కనబడేలా చేయడానికి సహాయపడుతుంది. అంతేకాక లిప్ స్టిక్ వేసుకొన్నా మీరు సౌకర్యవంతంగా ఫీలవుతారని చెబుతోంది.
ఈ రెడ్ లిప్ స్టిక్ ను వేసుకునే ముందు కొన్నిటిప్స్ అనుసరిస్తే చాలంటున్నారు నిపుణులు. ఏదైనా పాత బ్రష్ తో ముందుగా పెదవులపై పొడి లేకుండా తేమ వచ్చేవరకూ రుద్దాలి. లేత రంగులోకి వచ్చిన తరువాత పెదవులపై ఆ లిప్ స్టిక్ బ్రష్ తో అద్దాలి. మొదట పొరపై, రెండవ పొరపై సరైన రంగువచ్చేవరకూ బ్రష్ తో రుద్దాలి. అప్పడు త్రిడీ లూక్ తో అందంగా మెరిసే పెదవులు మీ సొంతమైనట్టే.