బస్సులో బాంబు పేలుడు: 12 మంది ప్రభుత్వ ఉద్యోగులు మృతి
పాకిస్థాన్ వాయువ్య ప్రాంతంలోని కైబర్ పక్తున్వ ప్రావెన్స్ చరసద్దా రహదారిపై శుక్రవారం ఓ బస్సులో బాంబు పేలి 12 మంది మరణించారని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. మరో 25 మంది గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని లేడి రిడీంగ్ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.
వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారని అన్నారు. ఆ ప్రావెన్స్లోని సివిల్ సెక్రటేరియట్లో విధులు ముగించిన అనంతరం ఉద్యోగులు బస్సులో ఇంటి వెళ్తుండగా ఆ ఘటన చోటు చేసుకుందని వివరించారు. ఆ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు.