ఉత్కంఠ రేపుతున్న 2.ఓ చిత్రం !
సాధారణంగా సినిమాను కాలక్షేప మాధ్యంగానే చూడాలి. నిజానికి అదే వాస్తవం కూడా. కానీ కొందరు దర్శకుల చిత్రాలే వినోదంతోపాటు, విజ్ఞానాన్ని, అబ్బురపరచే బ్రహ్మాండాలతో కనువిందు చేస్తాయి. అలాంటి అతి కొద్ది మంది భారతీయ సినీ దర్శకుల్లో శంకర్ ఒకరిని చెప్పవచ్చు. సాంకేతిక పరిజ్ఞానంపై అపార పట్టు ఉన్న ఈ స్టార్ డైరెక్టర్ తన ఇంద్రజాలంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయగలరని తన ముదల్వన్ చిత్రం నుంచి నిరూపించుకుంటూ వస్తున్నారు. అది ఎందిరన్ చిత్రానికి వచ్చే సరికి ఉన్నత శిఖరానికి చేరింది.
సూపర్‌స్టార్ రజనీకాంత్ గురించి చెప్పాలంటే స్టైల్ కింగ్‌గా పేరు తెచ్చుకున్నారు. అలాంటి రజనీకాంత్, దర్శకుడు శంకర్ల కలయికలో శివాజీ, ఎందిరన్ చిత్రాల తరువాత ముచ్చటగా రూపొందుతున్న మూడో చిత్రం 2.ఓ. రెండు చిత్రాల కంటే మరింత భారీ, బ్రహ్మాండంగా తెరకెక్కుతుంది. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు తెరపైకి వస్తుందని భారతీయ సినిమానే కాదు, ప్రపంచ సినిమా కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. ఎందుకంటే దర్శకుడు శంకర్ 2.ఓ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్‌పై చెక్కుతున్న తీరు అందరినీ అబ్బుర పరుస్తోంది.
గ్రాఫిక్స్ థ్రిల్లర్
శంకర్, రజనీ చిత్రం అంటే సాధారణంగా సమ్ థింగ స్పెషల్‌గా ఉంటుంది. శంకర్ కథ, దాన్ని నడిపే తీరు ఆసక్తిగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాటికి ఆయన స్టైల్లో సాంకేతిక పరిజ్ఞానం తోడైతే ఆ చిత్రం అద్భుతమే అవుతుంది. ఈ 2. ఓ చిత్రానికి పలు శాఖల్లో హాలీవుడ్ అత్యున్నత సాంకేతిక నిపుణులతో కలిసి శంకర్ పనిచేస్తున్నారు. ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యంత భారీ(రూ.450 కోట్లు) బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రంగా 2.ఓ చిత్రం నమోదు కానుంది.
వావ్ మేకింగ్
చిత్ర మేకింగ్ వీడియోను చూసిన వారందరూ వావ్ అంటూ ఆశ్యర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2.ఓ చిత్రం కోసం వేసిన భారీ సెట్స్, ఉపయోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వండర్ అనిపిస్తోంది. 2.ఓ చిత్రం కోసం యూనిట్ ఉక్రెయిన్ లాంటి విదేశాలతో పాటు ఢిల్లీ, ముంబై ప్రాంతాలు చుట్టొచ్చారు. ఆయా ప్రాంతాల్లో చిత్రీకరించిన సన్నివేశాలు 2.ఓ చిత్రానికి మరింత ఆకర్షణను చేకూర్చడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నారు.
స్టైలిష్‌గా సూపర్‌స్టార్
ఇటీవల కాలంలో గ్యాంగ్‌స్టర్ చాలా రఫ్‌గా కనిపిస్తున్న రజనీకాంత్ 2.ఓ చిత్రంలో మునుపటి కంటే మరింత గ్లామరస్‌గా, స్టైలిష్‌గా కనిపంచడమ ఆయన అభిమానుల్లో నూతనోత్సహాన్ని కలిగిస్తోంది. ఎందిరన్ చిత్రంలో మాదిరిగానే ఈ చిత్రంలోనూ రోబోగానూ, శాస్త్రవేత్తగాను కనిపించనున్నారు. హీరోయిన్ ఎమీజాక్సన్ అందాలు, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ రోరింగ యాక్షన్ 2.ఓ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని చెప్పాలా? ఇప్పటి వరకూ తీసినటువంటి సన్నివేశాలను చూసి రజనీకాంత్ మార్వ్‌లెస్ అంటూ శంకర్‌ను వాటేసుకుని ప్రశంసల జల్లులో ముంచెత్తారు.
ఆస్కార్ నాయకుడి సంగీతం
2.ఓ చిత్రానికి మరో బలానిచ్చే అంశం ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్.రెహ్మన్ సంగీతం. ఇందులో ఆరు పాటలకు మంచి మ్యూజిక్‌ను ఆయన అందించారు. అదే విధంగా మరో ఆస్కార్ అవార్డు గ్రహీత రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనింగ్, నీరవ్‌షా ఛాయాగ్రహణం మరింత ప్లస్ అవుతాయి. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ దుబాయ్ భారీ ఎత్తున నిర్వహించిన విషయం తెలిసిందే. జనవరిలో ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ భాషలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేయడానికి లైకా ప్రొడక్షన్ సన్నాహాలు చేస్తోంది.