స్పెయిన్ దాడిలో తప్పించుకున్న నటి
లండన్: భారత సంతతికి చెందిన టెలివిజన్ నటి లైలా రూసాస్ స్పెయిన్ ఉగ్రవాదుల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆమె తన 10 సంవత్సారాల కూతురు ఇనిజ్ ఖాన్ తో కలిసి సెలవుల సందర్భంగా బార్సిలోనా వెళ్లారు. ఉగ్రదాడి సమయంలో ఆమె దగ్గర్లో ఉన్న రెస్టారెంట్ ఫ్రిజర్‌లో దాక్కున్నామని తెలిపారు. ఆ సమయంలో అక్కడ ఉన్న వారందరిని రక్షించమని దేవున్ని ప్రార్థించానని ఆమె ట్విట్ చేశారు.
లైలా తండ్రి మొరాకోకు, తల్లి ఇండియాకు చెందినవారు. ఆమె బ్రిటిష్ టెలివిజన్‌కు చెందిన ప్రముఖ నటి. ఆమె ఫుట్‌బాలర్స్, వైవ్స్, హోల్బీ సిటీ వంటి షోలలో కనిపిస్తారు. లైలా బ్రిటిష్‌కు చెందిన స్నూకర్ ఆటగాడు రోనీ ఓసుల్లివాన్ను పెళ్లి చేసుకున్నారు. ఆమె తన టెలివిజన్ జీవితాన్ని 1990లోనే ఇండియాకి చెందిన ఛానల్ వీలో ప్రారంభించారు.
ప్రశాంతంగా ఉండి తనను రక్షించిన రెస్టారెంట్ ఉగ్యోగులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఐ లవ్ బార్సిలోనా అని ఆమె తన ట్విట్టర్ పేర్కొన్నారు. పర్యటకులతో నిత్యం రద్దీగా ఉండే రాంబ్లాస్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో14 మంది మృతిచెందగా, దాదాపుగా 100 మందికి పైగా గాయపడ్డారు. ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్ట్ గ్రూప్ ఈ దాడికి బాధ్యత వహించింది.