మన్యంకొండ జనసంద్రం
దేవరకద్ర రూరల్: మన్యంకొండ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం శనివారం భక్తజనసందోహంతో పులకించిపోయింది. స్వామివారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలిరావడంతో దేవస్థానం ప్రాంగణం కిటకిటలాడింది.
భక్తులు కొనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకున్నారు. కొంతమంది దాసంగాలు పెట్టి మొక్కులు తీర్చుకోగా మరికొంత మంది తలనీలాలు సమర్పించారు. క్యూలైన్లలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అక్కడక్కడ తోపులాట జరిగింది.