లలిత్బాబు ఓటమి
న్యూఢిల్లీ: ఢిల్లీ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ లలిత్ బాబుకు ఓటమి ఎదురైంది. గురువారం జరిగిన ఐదో రౌండ్ మ్యాచ్లో నేషనల్ చాంపియన్ మురళీ కార్తికేయన్... రెండో సీడ్ లలిత్బాబు (3.5)పై విజయం సాధించాడు. దీంతో 5 పాయింట్లు సాధించి కార్తికేయన్ ఈ టోర్నీలో అగ్రస్థానానికి చేరుకున్నాడు.