మంజీర ఒడ్డుకు భారీ మొసలి
మనూరు: మంజీర నది వట్టిపోవడంతో అందులోని మొసళ్లు ఒడ్డుకు వస్తున్నాయి. మెదక్ జిల్లా మనూరు మండలం షాపూర్ వద్ద ఆదివారం ఉదయం ఓ భారీ మొసలి చెరకు తోటలోకి వచ్చింది. దీని బరువు దాదాపు ఐదు క్వింటాళ్ల వరకు ఉండవచ్చని రైతులు తెలిపారు. మొసలి చెరకు తోటలోకి వచ్చిన విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చినా సాయంత్రం వరకు స్పందించలేదు. చేసేది లేక తోట యజమాని కాల్వల ద్వారా మొసలి వద్దకు నీటిని వదిలి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు.