Latham Century
-
లాథమ్ అజేయ శతకం
హామిల్టన్: ఓపెనర్ లాథమ్ (101 బ్యాటింగ్; 15 ఫోర్లు) అజేయ సెంచరీతో న్యూజిలాండ్‌ను ఆదుకున్నాడు. ఇంగ్లండ్‌తో శుక్రవారం మొదలైన ఈ రెండో టెస్టులో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సమయానికి 54.3 ఓవర్లలో 3 వికెట్లకు 173 పరుగులు చేసింది. వర్షం వల్లా చివరి సెషన్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. కివీస్ జట్టులో జీత్ రావల్ (5), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (4) ఆరంభంలోనే నిష్క్రమించారు. ఆ తర్వాత లాథమ్, రాస్ టేలర్ (53; 8 ఫోర్లు) మూడో వికెట్‌కు 116 పరుగులు జోడించి పరిస్థితి చక్కదిద్దారు. అర్ధసెంచరీ పూర్తిచేసుకున్న టేలర్‌ను వోక్స్ పెవిలియన్ చేర్చాడు. నికోల్స్ (5 బ్యాటింగ్) క్రీజులోకి రాగా 173/3 స్కోరు వద్ద రెండో సెషన్ ముగిసింది. ఆ తర్వాత ఓ మూడు బంతులే పడగా వర్షం వల్ల ఆట సాధ్యపడలేదు. -
కివీస్ దీటైన జవాబు
కొలంబో: ఎట్టకేలకు శ్రీలంక–న్యూజిలాండ్ రెండో టెస్టుకు వరుణుడు అడ్డు తొలగాడు. తొలి రెండు రోజులు వర్షంతో సగం ఆట కూడా సాగని ఈ మ్యాచ్‌లో శనివారం మాత్రం పూర్తి ఓవర్లు పడ్డాయి. ఓవర్‌నైట్ స్కోరు 144/6తో మూడో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన లంక 90.2 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. ధనంజయ డిసిల్వా (109; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించగా, కెప్టెన్ దిముత్ కరుణరత్నె (65; 6 ఫోర్లు) అర్ధసెంచరీ చేశాడు. సౌతీ (4/63), బౌల్ట్ (3/75) రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌కు దిగిన కివీస్ రోజు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. టామ్ లాథమ్ (111 బ్యాటింగ్; 10 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించాడు. కెప్టెన్ విలియమ్సన్ (20), టేలర్ (23), నికొల్స్ (15) ఎక్కువసేపు నిలువలేదు. లాథమ్‌కు కీపర్ వాట్లింగ్ (25 బ్యాటింగ్) సహకారం అందించాడు. -
లాథమ్ సెంచరీ
న్యూజిలాండ్ 315/4 బులవాయే: జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. టామ్ లాథమ్ (209 బంతుల్లో 105; 12 ఫోర్లు) సెంచరీతో చెలరేగడంతో శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 100 ఓవర్లలో 4 వికెట్లకు 315 పరుగులు చేసింది. టేలర్ (38 బ్యాటింగ్), సోధి (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. 32/0 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన కివీస్ ఆరంభంలోనే గప్టిల్ (40) వికెట్ కోల్పోయింది. అయితే విలియమ్సన్ (179 బంతుల్లో 91; 9 ఫోర్లు) సమయోచితంగా ఆడుతూ లాథమ్‌కు చక్కని సహకారం అందించాడు. ఈ ఇద్దరు రెండో వికెట్‌కు 156 పరుగులు జోడించారు. ఈ క్రమంలో లాథమ్ 200 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శతకం దిశగా సాగుతున్న విలియమ్సన్‌ను క్రెమర్ అవుట్ చేశాడు. తర్వాత వచ్చిన టేలర్ నిలకడగా ఆడాడు. లాథమ్‌తో కలిసి మూడో వికెట్‌కు 37 పరుగులు జోడించాడు. నికోలస్ (18) నిరాశపర్చినా.. సోధి మరో వికెట్ పడకుండా రోజును ముగించాడు.