'బాబు దివాలాకోరు రాజకీయాలకు పాల్పడుతున్నారు'
విజయవాడ: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించకుండా మంత్రి పదువలు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా విజయవాడలోని ధర్నా చౌక్‌లో శుక్రవారం వైఎస్సార్పీసీ ఆధ్వర్యంలో సేవ్ డెమోక్రసీ కార్యక్రమం చేపట్టారు.
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు దివాలాకోరు రాజకీయాలకు పాల్పడుతున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు కె. పార్థసారధి అన్నారు. రాజ్యంగం పై గైరవం ఉంటే పార్టీ మారిన నేతలతో రాజీనామ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలకు వామపక్షాలు సైతం తమ మద్దతు ప్రకటించి ధర్నాలో పాల్గొన్నాయి.