law services
-
ఆంధ్రప్రదేశ్లో 971 కంపెనీలు స్ట్రయిక్ ఆఫ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్లో తాజాగా 971 కంపెనీలు స్ట్రయిక్ ఆఫ్ అయ్యాయి. 2016–17, 2017–18 వరుసగా రెండేళ్లు వార్షిక రిటర్న్లు, బ్యాలెన్స్ షీట్లను ఫైల్ చేయని కారణంగా సెక్షన్ 248 ప్రకారం ఈ కంపెనీలను స్ట్రయిక్ ఆఫ్ చేసినట్లు ఇండియన్ కార్పొరేట్ లా సర్వీసెస్ (ఐసీఎల్ఎస్) సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. తొలిసారిగా స్ట్రయిక్ ఆఫ్ అయిన కంపెనీల బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేసినట్లు చెప్పారు. కంపెనీల డేటాతో పాటు బ్యాంక్ అకౌంట్, పాన్ నంబర్ల వివరాలను ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్, ఆర్బీఐ, ఐటీ, జీఎస్టీ కార్యాలయాలకు పంపించామన్నారు. 5 వేల మంది డైరెక్టర్లు డిస్క్వాలిఫై... 2015–16, 2016–17, 2017–18 వరుసగా మూడేళ్ల పాటు బ్యాలెన్స్ షీట్లను సమర్పించని వివిధ కంపెనీలకు చెందిన సుమారు 5 వేల మంది డైరెక్టర్లను అనర్హులుగా (డిస్క్వాలిఫై) ప్రకటించారు.వీరిలో అక్షయ గోల్డ్, అగ్రిగోల్డ్ వంటి కంపెనీల డైరెక్టర్లున్నారు. -
రేపటి నుంచి ‘ఉమ్మడి’ హైకోర్టు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు సేవలు - అధికారిక నోటిఫికేషన్ విడుదల - వేసవి సెలవుల తర్వాత - 2న హైకోర్టు పునఃప్రారంభం - ప్రవేశంపై భద్రతా కారణాలతో ఆంక్షలు సాక్షి, హైదరాబాద్: హైకోర్టు సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడిగా న్యాయసేవలు అందించనుంది. జూన్ 2 అపాయింటెడ్ డే కావడంతో పాటు అదే రోజున హైకోర్టు వేసవి సెలవుల అనంతరం పునఃప్రారంభం కానుంది. ఇప్పటి వరకు ‘హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’గా ఉన్నా సోమవారం నుంచి ‘హైకోర్ట్ ఆఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’గా వ్యవహరించనున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 30కి అనుగుణంగా ఈ మార్పులు చేశారు. ఇందుకు సంబంధిం చి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కె.శివప్రసాద్ శని వారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ప్రకారం జూన్ 2 నుంచి కక్షిదారులు, న్యాయవాదులు కొత్త పేరు మీదనే పిటిషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. హైకోర్టు ఉత్తర్వులు, ఇతర ఉత్తరప్రత్యుత్తరాలన్నీ ఇదే పేరు మీద ఉంటాయి. ఇదిలాఉండగా, ఉమ్మడి హైకోర్టును తెలంగాణ న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో హైకోర్టులో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందని నిఘా వర్గాలు నివేదికలు ఇచ్చాయి. ఇందుకు సంబంధించి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ నుంచి కూడా హైకోర్టుకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో న్యాయవాదులు, కక్షిదారుల ప్రవేశానికి సంబంధించి రిజిస్ట్రార్ జనరల్ శివప్రసాద్ కొన్ని మార్గదర్శకాలను జారీ చేశారు. భద్రతా కారణాల రీత్యా తదుపరి ఉత్తర్వులిచ్చేంత వరకు ఇవి అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. ఈమేరకు సరైన కారణం చెప్పకుంటే హైకోర్టులో ప్రాక్టీస్ చేయని న్యాయవాదులనెవర్నీ అనుమతించరు. భద్రతా సిబ్బందికి హైకోర్టు న్యాయవాదులు, ఇతరులు తమ గుర్తింపు కార్డులు చూపాల్సి ఉంటుం ది. కక్షిదారుల గుర్తింపునకు సంబంధించి సమస్య వస్తే వారి న్యాయవాది భద్రతా సిబ్బందికి తెలియజేయాలి.