న్యాయదేవతకు ‘లక్ష్మణ’రేఖ
విశ్లేషణ: రణబీర్ సేన మరొక దాడికి దిగుతుంది. ఏభయ్యో, అరవయ్యో దళితుల ప్రాణాలు పోతాయి. దీనికి అంతంలేదా? న్యాయవ్యవస్థపై అనుమానాలు ఉన్నాయి. అది దళితుల ప్రాణ, మానాలను కాపాడలేకపోతున్నది. సభ్యసమాజం దీని గురించి ఏమీ ఆలోచించదు. ‘‘పోతున్నవి దళితుల ప్రాణాలే కదా’’ అనే నిర్లక్ష్యధోరణి నానాటికీ పెరిగిపోతున్నది.
న్యాయదేవత కళ్లకు గంతలు కట్టి ఉంటాయి. కాని ఆ గంతల్లో నుంచి న్యాయం కోసం తన ఎదుట నిలబడినవారెవరో ఆమె చూస్తూనే ఉంటుంది. తనకిష్టై మెన వాళ్లకు న్యాయం అంది స్తుంది. ఇష్టంలేని వారు ఎదుట నిలబడితే కళ్లు మూసుకుంటుం ది. ‘న్యాయదేవత ముందు అం దరూ సమానమే’ అనే సూత్రం భ్రమ మాత్రమే! ఈ భ్రమను తొలగించటానికి అప్పుడప్పుడూ న్యాయదేవత నిజంగానే ‘న్యాయం’ అందిస్తుంది. అది చూసి మనకూ న్యాయం దొరుకుతుందనే భ్రమలో కొట్టుకుపోతారు జనం. అటువంటి భ్రమలోనే ఇప్పుడు లక్ష్మణ్‌పూర్ బాతే లోని దళితులు కొట్టుమిట్టాడుతున్నారు. 58 మందిని చంపిన భూస్వాములకు అద్వాల్ జిల్లా సెషన్స్ కోర్టు 16 గురికి మరణశిక్ష, 10 మందిపై యావజ్జీవ కారాగారశిక్ష విధిస్తే, పాట్నా హైకోర్టు వాళ్లందరినీ విడిచిపెట్టేసింది.
లక్ష్మణ్‌పూర్ బాతే బీహార్‌లోని అర్వల్ జిల్లాలో, పాట్నా నగరానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ గ్రామంలో రాజపుట్లు, భూమిహార్లు, దళితులు ప్రధానం గా ఉంటారు. బీహార్ జిల్లాల్లో చాలాచోట్ల ఉన్నట్టే ఆ గ్రామంలో కూడా ‘రణబీర్ సేన’ ఉన్నది. ఈ సేనలో రాజ్ పుట్లు, భూమిహార్లు ఉన్నారు. భూస్వాముల దౌర్జన్యా లకు, క్రూరత్వానికి, అమానుషత్వానికి ఈ రణబీర్సేన అండగా ఉంటుంది. దళితులకు భూమిలేదు కాబట్టి వాళ్లు భూస్వాముల భూముల్లో కూలిపని చేయాలి. పని చేస్తే శ్రమకు తగ్గ కూలి ఇవ్వరు. అలా అని పనికి వెళ్లకపోతే భూస్వాములు వారిని కొడతారు, చంపుతారు. దళితులు పనికి రావటం లేదంటే, పనికి తగ్గ కూలి ఇవ్వమని అడు గుతున్నారంటే ‘మావోయిస్టుల’ అండ ఉందని భూస్వా ముల నమ్మకం. ఆ అనుమానంతోనే దళితులపై భూస్వా ములు దాడిచేస్తుంటారు. బీహార్ నిండా ఇటువంటి ఘటనలే! బెల్బీ మారణహోమం వీటికి పరాకాష్ట.
రణబీర్సేన ఘాతుకం
లక్ష్మణ్‌పూర్ బాతే గ్రామంలో కూడా దాడికి పెద్ద ఎత్తున రణబీర్సేన దిగింది. 1997, డిసెంబర్ 1 అర్ధరాత్రి భూమి హార్లు, రణబీర్సేన మారణాయుధాలతో, తుపాకులతో, కత్తులతో గ్రామం మీద విరుచుకుపడి నిద్రిస్తున్న వారిలో 58 మందిని నరికి ముక్కలు ముక్కలు చేసిపోయారు. అందులో 27 మంది స్త్రీలు, 16 మంది పిల్లలు ఉన్నారు. పిల్లల్లో అందరికంటే చిన్న వాని వయస్సు ఒక ఏడాదే! స్త్రీలలో కొందరు గర్భిణులు. వాళ్లనెందుకు చంపారంటే భవిష్యత్తులో ‘మావోయిస్టులు’ ఆ గ్రామంలో పుట్టకూడ దనట! దళితులవి అన్నీ గుడిసెలే. తలుపులు పగలగొట్టి నిద్రిస్తున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు సాగిం చారు. సోన్ నది ఒడ్డున ఉన్న దళితవాడ ఇంచుమించు పూర్తిగా తుడుచుపెట్టుకుపోయింది. దళితుల్ని 35 మంది నరుక్కుపోతుంటే మరో 80 మంది హంతకులకు రక్షణగా గ్రామం చుట్టూ కాపలా కాశారు. 1997, డిసెంబర్ 1న ఈ నరమేధం జరిగితే సుమారు పద్నాలుగేళ్ల విచారణ తర్వాత పాట్నా జిల్లా అదనపు సెషన్స్ జడ్జి 16 మందికి మరణశిక్ష, పది మందికి యావజ్జీవ కారాగారశిక్ష విధిం చారు. ఈ శిక్షలు కేసులోని ప్రత్యక్ష సాక్షులను విచారించిన తర్వాత, వారి సాక్ష్యాన్ని నమ్మి, సెషన్స్ జడ్జి 2010, ఏప్రిల్ 7న శిక్షలు విధించారు. 2008, డిసెంబర్లో కోర్టు అభి యోగాలను తయారు చేసింది. దారుణ మారణహోమం జరిగిన పదకొండేళ్లకు న్యాయవిచారణ రథం కదిలింది. మరో ఐదేళ్ల తర్వాత హైకోర్టు మొత్తం కేసు కొట్టివేస్తూ ముద్దాయిలను విడుదల చేసింది.
జడ్జికో న్యాయమా?
ప్రత్యక్ష సాక్షులను స్వయంగా విచారించిన సెషన్స్ జడ్జి ఆ సాక్ష్యాలను నమ్మి, ఆధారాలు సరైనవేనని విశ్వసించి ముద్దాయిలకు శిక్ష విధించారు. అదే సాక్ష్యాల మీద హైకోర్టు ఎలా దోషులను విడుదల చేస్తుంది? సాక్ష్యాలు మారవు, సాక్షులు మారరు, ఆధారాలు తారుమారు కావు. అటువంటప్పుడు ఒక జడ్జి నమ్మిన సాక్ష్యాలను, మరో జడ్జి అవే సాక్ష్యాలను నమ్మకుండా ఎలా ఉంటాడు? అంటే మారింది జడ్జి అన్నమాట! ఒకో జడ్జికి ఒకో న్యాయం ఉం టుందా? పైగా ఈ కేసులో మొత్తం 152 మంది సాక్షులను విచారించారు. ఇంత పెద్ద ఎత్తున సాక్ష్యాధారాలుంటే ‘ఈ సాక్ష్యాలు నమ్మదగినవిగా లేవు’ అని ఒక్కమాటతో 58 హత్యలు బూడిదలో కలిసిపోయాయి. ‘సాక్ష్యాలు నమ్మద గినవిగా లేవు’ అంటే సాక్షులు అబద్ధం చెబుతున్నారనా? అంటే దళితులు అబద్ధాలు చెపుతారనా? సాక్ష్యాలు విన్న సెషన్స్ కోర్టు ఆ మాట అనలేదు. సాక్షులను చూడని, సాక్షులు సాక్ష్యం ఇస్తున్న సందర్భంలో వారి ముఖ కవళి కలు, ఉద్విగ్నత, ఆందోళన, భయాలు ఎలా ఉండేవో వినని, చూడని హైకోర్టు ఏ ప్రాతిపదికపైన ‘నేను నమ్మ టం లేదు’ అని అనగలదు? అవును మరి, వారికి నమ్మకం కుదరదు. సాక్షులు దళితులు, చనిపోయింది దళితులు, చంపింది అగ్రకులాల వారు. న్యాయమూర్తులు అగ్రకు లాల వారు. వారికి నమ్మకం కలగకపోవటం అనేది అనా దిగా వస్తూనే ఉన్నది. సామాజిక వ్యవస్థలో ఎక్కడో లోపం ఉందనుకుంటున్నాం గాని న్యాయవ్యవస్థలో కూడా లోపం ఉంది. దానిని సవరించనంత వరకూ దేశవ్యాప్తంగా దళి తులపై అగ్రవర్ణాల మారణకాండ సాగుతూనే ఉంటుంది. న్యాయమూర్తులు వారిని విడిచిపెట్టేస్తుంటారు.
మిగిలిన ఒకే ఆశ సుప్రీంకోర్టు
ఇప్పుడు దళితులకు ఉన్న ఒకేఒక ఆశ సుప్రీంకోర్టు. అక్కడ మాత్రం న్యాయం జరుగుతుందని నమ్మకం ఏమిటి? ఎన్నో కేసుల్లో సెషన్స్ కోర్టు శిక్షవిధిస్తే హైకోర్టు దానిని కొట్టేస్తుంది. సుప్రీంకోర్టు కూడా ‘ఇందులో మేం జోక్యం కలుగజేసుకోలేం’ అంటుంది. ఎక్కడో చెదురుమదురుగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుంది. ఇప్పుడు సుప్రీం కోర్టుకు అప్పీలు చేయాలి. ముందు దానికి సుప్రీంకోర్టు నుంచి అనుమతి తీసుకోవాలి. ఇస్తే ఇస్తుంది, లేదంటే లేదు. అంతా సుప్రీంకోర్టు దయ! అప్పీలు వినకుండానే అనుమతి నిరాకరించవచ్చు. ఇలా చాలా కేసుల్లో జరిగిం ది. లక్ష్మణ్‌పూర్ బాతే దళితులు కేసు తీర్పు వచ్చిన రోజు నుంచి భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఒక పక్క రణబీర్సేన నాయకులు, లక్ష్మణ్‌పూర్ బాతే అగ్రకులాల వారు బాణాసంచా కాలుస్తున్నారు. మిఠాయి పంచుకుం టున్నారు. వారు చేస్తున్న హడావుడి చూస్తుంటే ఏ రాత్ర యినా మళ్లీ దళితవాడ మీద విరుచుకుపడతారేమో అనే భయం కలుగుతున్నది.
పునరావృతం కాదా!
‘‘వారిపై పోరాటం చేయడానికి నాలో సత్తువలేదు. 58 మందిని హతమార్చిన వారిలో ఒక్కరికైనా శిక్ష పడలేదు. అందరూ నిర్దోషులనే కోర్టు తేల్చింది. కోర్టులు వాళ్లవి, ప్రభుత్వం వారిది. లాఠీలు వాళ్లవి. మా దగ్గర ఏమీ లేవు’’... ఆ రాత్రి దాడిలో కాలు విరిగిపోయి, ప్రాణాలు దక్కించుకున్న ఓ దళితుడి ఆవేదన ఇది. ‘‘ఒక్క కుటుం బంలోనే ఏడుగురిని కోల్పోయిన మాలో బలం ఎక్కడ నుంచి వస్తుందిక! ఎంతో మంది చనిపోయారు. చంపిన వారికి ఏమీ జరగలేదు. ఇప్పుడు హంతకులు మమ్మల్ని భయపెడుతున్నారు’’ అంటుంది ఒక దళిత మహిళ. ఆమె కుటుంబంలోనే ఏడుగురిని రణబీర్ సేన హతమార్చింది. అందరి మనసుల్లోనూ ఇదే భయం! సుప్రీంకోర్టు అప్పీలు స్వీకరించి విచారించే సరికి మరో ఐదారేళ్లు సులువుగా జరి గిపోతాయి. అప్పటి వరకూ ఆ గ్రామ దళితులు భయం భయంగా బతకవలసిందేనా? భోజ్‌పూర్ జిల్లా బత్తని తోలా గ్రామంలో దళితులు కూడా ఇదే పరిస్థితిని ఎదు ర్కొంటున్నారు.
సుప్రీంకోర్టులో అప్పీలు వేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటుంది. ఆ తర్వాత దానిని మరిచి పోతుంది. ఈ లోగా రణబీర్ సేన మరొక దాడికి దిగు తుంది. ఏభయ్యో, అరవయ్యో దళితుల ప్రాణాలు పోతా యి. దీనికి అంతంలేదా? న్యాయవ్యవస్థపై అనుమానాలు న్నాయి. అది దళితుల ప్రాణ, మానాలను కాపాడలేకపో తున్నది. సభ్యసమాజం దీని గురించి ఏమీ ఆలోచించదు. ‘‘పోతున్నవి దళితుల ప్రాణాలే కదా’’ అనే నిర్లక్ష్యధోరణి నానాటికీ పెరిగిపోతున్నది. పోలీసువ్యవస్థ, న్యాయవ్య వస్థ రణబీర్ సేన లాంటి వారి వెనుకలేవని, అగ్రకులా లకు అండగా ఎప్పుడూ నిలబడవనే భరోసా దళితులకు ఇవ్వాలి. న్యాయవ్యవస్థ కూడా అలాంటి ధైర్యాన్ని అందిం చాలి. ఈ రెండూ జరగనంత కాలం ‘లక్ష్మణ్‌పూర్ బాతే’లు జరుగుతూనే ఉంటాయి. వందలాది దళితులు ప్రాణాలు కోల్పోతారు, వారి ఇళ్లు, గ్రామాలు తగలబడిపోతాయి, వారి స్త్రీలు అత్యాచారాలకు గురవుతూనే ఉంటారు. ఈ దేశం సిగ్గులో తలవంచుకోవాల్సి ఉంటుంది.