ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి మృతి
హైదరాబాద్: ఎల్బీనగర్లోని డీమార్ట్ వద్ద మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్పై వెళ్తున్న సతీష్(22) అనే యువకుడిని ఏలూరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన జరిగిన తర్వాత డ్రైవర్ భయంతో బస్సును ఆపకుండా వెళ్లిపోయాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వెంబడించి డ్రైవర్ను హయత్నగర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.