రాఖీ పండుగకు వెళ్లి యువతి అదృశ్యం
హైదరాబాద్(నాగోలు) : రాఖీ పండుగకు వెళ్లిన యువతి కనిపించకుండా పోయిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎన్టీఆర్నగర్కు చెందిన బి.రమాదేవి (20) ఈ నెల 18న రాఖీ పండుగ సందర్భంగా బయటకు వెళ్లింది.
అయితే ఎంతకూ ఆమె ఇంటికి తిరిగి రాలేదు. ఆచూకీ కోసం పరిసర ప్రాంతాలలో వెతికినా ప్రయోజనం లేకపోయింది. దీంతో రమాదేశి కుటుంబ సభ్యులు ఎల్బీనగర్ పోలీస్స్టేషన్లో ఆమె కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.