నాలుగు వేరియంట్లలో లీఎకో కొత్త ఫోన్
ముందస్తు అంచనాల మాదిరిగా గానే చైనీస్ టెక్నాలజీ సంస్థ లీఎకో, తన లేటెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. లీ ప్రో 3 పేరుతో ఈ ఫోన్‌ను ముందుగా స్వదేశంలో లాంచ్ చేసింది. వచ్చే వారం నుంచి ప్రారంభంకాబోతున్న ఫ్లాష్ అమ్మకాలకు ఆసక్తి గల వినియోగదారులు ఇప్పటినుంచే రిజిస్ట్రర్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. గోల్డ్, గ్రే, సిల్వర్ కలర్ వేరియంట్లలో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. మొత్తం నాలుగు వేరియంట్లలో ఈ ఫోన్‌ను ఆవిష్కరించింది.
ఒకటి 4 జీబీ ర్యామ్+32 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ వెర్షన్, 1,799 యువాన్లు (సుమారు 18,100 రూపాయలు)
రెండు 6 జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్ వెర్షన్, 1,999 యువాన్లు (సుమారు రూ.20,100 రూపాయలు)
ప్రముఖ చైనీస్ ఫిల్మ్‌మేకర్ జాంగ్ ఇమౌ పేరుమీద మరో రెండు వేరియంట్లను లీఎకో లీ ప్రో 3 ఫోన్‌ను ప్రవేశపెట్టింది. దానిలో ఒకటి 4 జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్ జాంగ్ ఇమౌ ఎడిషన్, ధర 2,499 యువాన్లు(సుమారు రూ.25,100). రెండోది 6 జీబీ ర్యామ్+128 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ వెర్షన్‌ను ధర 2,999 యువాన్ల(సుమారు రూ.30,100)కు కంపెనీ ఆవిష్కరించింది.
మెమరీ, ఇన్‌బిల్ట్ స్టోరేజ్ తేడాలు మినహా మిగతా ఫీచర్లన్నీ ఈ వేరియంట్లలో సమానంగా ఉన్నట్టు కంపెనీ తెలిపింది. అయితే 8 జీబీ ర్యామ్ వేరియంట్‌తో ఈ ఫోన్‌ను లీఎకో తీసుకొస్తుందని టెక్ వర్గాలు భావించాయి. కానీ 6జీబీ ర్యామ్‌లో మాత్రమే ఈ ఫోన్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. అయితే దీనిలో మైక్రో ఎస్డీ కార్డు ద్వారా మెమరీని విస్తరించుకునే అవకాశాన్ని కంపెనీ కల్పించలేదు. రియర్ ప్యానెల్లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఈ ఫోన్ కలిగిఉంది.
ఈ ఫోన్ ఫీచర్లు..
5.5 అంగుళాల ఫుల్-హెచ్డీ డిస్ప్లే విత్ 2.5డీ కర్వ్డ్ గ్లాస్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో
2.35 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 821 ఎస్ఓసీ
16 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
4జీ ఎల్టీఈ
4070 ఎంఏహెచ్ బ్యాటరీ
175 గ్రాములు