ప్రశాంత్‌కు 8 వికెట్లు
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీఏ ‘ఎ’ 2,3 డివిజన్ రెండు రోజుల లీగ్ చాంపియన్‌షిప్‌లో సుల్తాన్ షాహి బౌలర్ ప్రశాంత్ (8/43) చెలరేగాడు. కీలక సమయంలో ఎనిమిది వికెట్లు తీయడంతో 196 పరుగుల తేడాతో విజయ్ హనుమాన్ జట్టుపై గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన సుల్తాన్ షాహి 309 పరుగులు చేసింది. ప్రసాద్ యాదవ్ (52), వంశీ రాఘవ (52), సత్కుమార్ (48) రాణించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విజయ్ హనుమాన్ 113 పరుగులకే కుప్పకూలింది. ప్రశాంత్ ధాటికి చకచకా వికెట్లు కోల్పోయింది. సుకేన్ జైన్ (41) మినహా మిగతా వారు విఫలమయ్యారు.
మరో మ్యాచ్‌లో సీసీఓబీ 116 పరుగుల తేడాతో తెలంగాణ టీమ్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సీసీఓబీ 229 పరుగులు చేసింది. షాహబాజ్ తుంబి (85), నఫీజ్ (47) ఫర్వాలేదనిపించారు. జయసూర్య (5/52) శ్రమ వృథా అయ్యింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన తెలంగాణ 113 పరుగులకు మాత్రమే పరిమితమైంది. జయసూర్య (32) కాస్త రాణించాడు. పర్వేజ్, అబ్దుల్, మన్నన్లు తలా మూడు వికెట్లు తీశారు.
ఇతర మ్యాచ్‌ల స్కోరు వివరాలు
ఠ జెమిని ఫ్రెండ్స్: 133 (క్రిస్ కళ్యాణ్ 43, ఖురేషి 3/27); ఎస్ఏ అంబర్పేట్: 88/3 (పరమ్‌వీర్ 42 నాటౌట్).
ఎ-డివిజన్ వన్డే లీగ్ స్కోరు వివరాలు
ఠ మణికుమార్: 177 (శ్రీకాంత్ 31, సాయి కుమార్ 30, రామ్‌దేవ్ 37, అరాఫత్ 3/4); ఏవీసీసీ: 181/2 (యాష్ కపాడియా 74 నాటౌట్, సాయి ప్రజ్ఞాన్ 50 నాటౌట్).
ఠ సదరన్ రేమండ్స్: 251/9 (అరుణ్ 89, ఆదిల్ 4/36); డెక్కన్ బ్లూస్: 100