భార్య కోసం ఒక గిటార్
ఇలాంటి వ్యవసాయక్షేత్రాల్ని మీరు చూసేవుంటారు. కాకపోతే భార్య కోసం భర్త చేసిన ప్రేమ స్మరణ కావడం దీని ప్రత్యేకత. అర్జెంటీనాలోని లేబోలాయె పట్టణానికి చెందిన దంపతులు పెద్రో ఉరేటా, గ్రేసియేలా యరైజోజ్. గ్రేసియేలా హఠాన్మరణం చెందడంతో ఆమె గుర్తుగా ఆమెకు ఇష్టమైన గిటార్‌ను ‘నాటే’ ప్రయత్నం చేశాడు పెద్రో. తన నలుగురు పిల్లల సహకారంతో ఏళ్లకొద్దీ శ్రమించి, నిర్మించిన ఈ గిటార్ పొడవు ఒక కిలోమీటర్. దీనిలో మొత్తం 7000 మొక్కలున్నాయి.
బాడీ కోసం సైప్రస్, తీగల కోసం నీలగిరుల్ని నాటారు. తీగలు మోగకపోయినా ఆయన హృదయరాగం అర్థమైంది కదా!