న్యాయ సలహా కేంద్రాలకు కొత్త హంగులు
నిజామాబాద్ లీగల్, న్యూస్‌లైన్: గ్రామాలు, మేజర్ గ్రామ పంచాయతీలు, మండల కేంద్రాల్లో న్యాయ సలహాలు అందించడానికి ఏర్పాటు చేసిన న్యాయ సలహా కేంద్రాలు కొత్త హంగులను సంతరించుకుంటున్నాయి. న్యాయ సలహాల కోసం కోర్టుల వద్దకు వెళ్లనవసరం లేకుండా ప్రజల వద్దకు న్యాయ సలహాలు అందించడం ఈ కేంద్రాల లక్ష్యం. ఈ కేంద్రంలో ఒక న్యాయవాది ప్రతి శనివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 వరకు అందుబాటులో ఉండి ప్రజలకు చట్టపరమైన విషయాలలో ఉచితంగా సలహాలను అందిస్తారు. న్యాయ సలహాల కేంద్రాల పేర్లను న్యాయ పరిరక్షణ, అభివృద్ధి కేంద్రాలుగా వ్యవహరిస్తూ ప్రతి కేంద్రం వద్ద నూతనంగా బోర్డును ఏర్పాటు చేస్తున్నారు.
శనివారం కాకుండా ఇతర రోజులలో సలహాలు కోరే ప్రజల సౌకర్యార్థం అన్ని కేంద్రాల వద్ద ఆయా పంచాయతీల సహకారంతో ఒక ఫిర్యాదు పెట్టెను ఏర్పాటు చే స్తున్నారు. సలహాలను కోరేవారు దాఖలు చేసే పత్రాలను ఈ పెటె ్టలో వేస్తే న్యాయసేవా సంస్థ న్యాయమూర్తి పరిశీలించి తగు న్యాయ సహాయం అందిస్తారు. అలాగే న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, తదితర ఫోన్ నెంబర్లు కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచడానికి చర్యలు తీసుకుంటున్నారు.