ఫాదర్ కొప్పలను అమెరికా బహిష్కరించే అవకాశం
వాషింగ్టన్(ఐఏఎన్ఎస్): అమెరికాలోని మిన్నెసోటాలో ఓ 12 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రోమన్ కేథలిక్ నెల్లూరు డయోసీస్(క్రై స్తవ జిల్లా)కు చెందిన ఫాదర్ లియో చార్లెస్ కొప్పల (47) అంగీకరించాడు. ఇందుకు అతని ప్రవర్తనపై 25 ఏళ్లపాటు నిఘాకు ఆదేశిస్తూ స్థానిక కోర్టు తీర్పు చెప్పింది. దీంతో కొప్పలను అమెరికా నుంచి బహిష్కరించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన్ను హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం దక్షిణ మిన్నెసోటాలోని వినోనా డైయోసీస్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన్ను కోర్టు తీర్పు నేపథ్యంలో శాశ్వతంగా పదవి నుంచి తప్పించారు. 2013 జూన్ 8న ఓ వద్ధురాలి ఆహ్వానం మేరకు ఆమె ఇంటికి విందుకు వెళ్లిన కొప్పల, ఆమె మనవరాలిపై వికత చేష్టలకు పాల్పడ్డాడు. దీనిపై వద్ధురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేయగా కోర్టులో కొప్పల తన నేరాన్ని అంగీకరించారు.