ఎల్ జీ ఉచిత సర్వీసు క్యాంపు
చెన్నై: వరదలతో అతలాకుతలమైన చెన్నైలో తమ వినియోగదారుల కోసం ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ఎల్ జీ ఉచిత సర్వీసు క్యాంపు ప్రారంభించింది. వరదల కారణంగా దెబ్బతిన్న గృహోపకరణాలు, ఇతర వస్తువులను ఉచితంగా బాగుచేస్తామని, ఎటువంటి రుసుం వసూలు చేయబోమని ఎల్ జీ ఒక ప్రకటనలో తెలిపింది. ఏవైనా విడిభాగాలు అవసరమైతే 50 శాతం డిస్కౌంట్ తో అందిస్తామని వెల్లడించింది.
'భారీ వర్షాలు, వరదల కారణంగా చెన్నైలో తీవ్ర నష్టం సంభవించింది. బాధితులు త్వరగా కోలుకుని సాధారణ జీవితం గడపడానికి మా వంతు సాయం చేయాలన్న ఉద్దేశంతో ఉచిత క్యాంపు ఏర్పాటు చేశామ'ని ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ వినియోగదారుల సేవా విభాగం అధిపతి వినోద్ కుమార్ తెలిపారు. వరదలతో చెన్నైలోని పలు ప్రాంతాల్లో వేలాది మంది గృహోపకరణాలతో సర్వం కోల్పోయి రోడ్డుపడ్డారు.