శాంసంగ్ ‘ఎస్8’కి పోటీగా ఎల్జీ ‘జీ6’
ధర రూ.51,990
న్యూఢిల్లీ: శాంసంగ్ గెలాక్సీ ఎస్8 స్మార్ట్ఫోన్కు దీటుగా ‘ఎల్జీ’ తాజాగా ‘జీ6’ అనే స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.51,990గా ఉంది.
ఇందులో 5.7 అంగుళాల క్యూహెచ్డీ ప్లస్ స్క్రీన్, గూగుల్ అసిస్టెంట్, రెండు 13 ఎంపీ రియర్ కెమెరాలు, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 821 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ నుగోట్ ఓఎస్, హీట్కూల్ పైప్స్, 3,300 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ తెలిపింది. మంచి పనితీరు, దీర్ఘకాల మన్నిక, అదిరిపోయే డిజైన్ వంటి పలు ఫీచర్లను కోరుకుంటున్న కస్టమర్లకు తమ ప్రొడక్ట్ అనువుగా ఉంటుందని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా కార్పొరేట్ మార్కెటింగ్ హెడ్ అమిత్ గుజ్రాల్ తెలిపారు.