స్విమ్స్‌లో లైఫ్‌కేర్ ఫార్మసీ సీజ్
తిరుపతి సిటీ: స్విమ్స్ ఆస్పత్రి అత్యవసర విభాగానికి ఆనుకుని హిందూస్థాన్ లేటెక్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తున్న లైఫ్‌కేర్ ఫార్మసీని డ్రగ్ కంట్రోల్ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రద్దయిన లెసైన్స్‌తో మందులు విక్రయిస్తుండడంతో రెండు నోటీసులు అనంతరం డ్రగ్ అధికారులు దీనిని సీజ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏడాది క్రితం ఈ ఫార్మసీ ప్రారంభమైంది.
ఇందులో 24 గంటలకు ముగ్గురు ఫార్మాసిస్టులను నియమించారు. నాలుగు మాసాల క్రితం వారందరూ ఫార్మసీ సర్టిఫికెట్లను డ్రగ్ కంట్రోల్ నుంచి వెనక్కి తీసేసుకున్నారు. దీంతో పలుమార్లు హెచ్చరించిన అధికారులు చివరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనిపై సంబంధిత నిర్వాహకుడితో మాట్లాడగా తాము మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఫార్మసీని మూతవేసినట్లు తెలిపారు.
స్విమ్స్ రోగులకు కుచ్చుటోపీ
స్విమ్స్ ఆస్పత్రికి వచ్చే రోగులకు మందులపై 10 నుంచి 60 శాతం వరకు తగ్గింపు ఇస్తామని చెప్పిన లైఫ్‌కేర్ ఫార్మసీ నిర్వాహకులు ఆచరణలో మాత్రం మొండిచెయ్యి చూపారు. రోగులకు కేవలం 10 శాతం మాత్రమే తగ్గింపు ఇచ్చి కుచ్చుటోపీ పెట్టారు. సాధారణంగా స్విమ్స్‌లో మెడికల్ షాపు నిర్వహించాలంటే నెలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు అద్దె టెండర్ ద్వారా పలుకుతోంది. అయితే వీరు ముందుగా రోగుల సేవలను ప్రస్తావించినందున యాజమాన్యం నెలకు కేవలం రూ.లక్ష నామమాత్రపు అద్దెకు కేటాయించడం విమర్శలకు తావిస్తోంది.
నిబంధనలు పాటించలేదు
డ్రగ్ యాక్ట్‌లోని నిబంధనలను అతిక్రమించినందునే లైఫ్‌కేర్ సెంటర్‌ను సీజ్ చేశాం. నిర్వాహకులు రెండు నోటీసులు జారీ చేసినా స్పందించలేదు. దీంతో సీజ్ చేశాం. స్విమ్స్ అధికారులు రోగులకు ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలి.
- విజయభాస్కర్‌రావు, డ్రగ్ ఇన్స్పెక్టర్, తిరుపతి