ఎత్తిపోతల నిర్వహణ ప్రైవేటు ఏజెన్సీలకే!
• నీటిపారుదల శాఖ
• సూత్రప్రాయ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాల నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలని నీటిపారుదల శాఖ సూత్ర ప్రాయంగా నిర్ణయించింది. నిర్వహణ గడు వును పొడిగించేందుకు కాంట్రాక్టు ఏజెన్సీలు విముఖత చూపడం, బాధ్యత తీసుకునేం దుకు జెన్కో ముందుకు రాకపోవడంతో ప్రైవేటు మార్గమే సరైందనే భావనకు వచ్చిం ది. మే లోగా టెండర్ల ద్వారా నిర్వహణను అప్పగించేలా ప్రణాళిక వేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 19ఎత్తిపోతల పథకాలు కొనసాగు తున్నాయి. ఇందులో 12 పూర్తవగా, ఇప్ప టివరకు వీటి బాధ్యతను ఏజెన్సీలు చూస్తు న్నాయి. కాంట్రాక్టు సంస్థలు ఆ పథకాలు అమల్లోకి వచ్చిన మూడేళ్లు వాటి నిర్వహణ బాధ్యత చూసుకోవాలి. మొత్తం ప్రాజెక్టు క్యాపిటల్ కాస్ట్లో ఒక శాతం కాంట్రాక్టు సంస్థలకు ప్రభుత్వం చెల్లిస్తుంది.
అయితే గడువు ముగిశాక నిర్వహణ ఎలా అని దానిపై ఆలోచించిన ప్రభుత్వం.. మరో రెండేళ్లు వాటి నిర్వహణ చూడాలని కాంట్రా క్టర్లను కోరింది. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు నిర్వహణ చూస్తున్న జెన్కోకు చెల్లిస్తున్న మాదిరే తమకూ క్యాపిటల్ కాస్ట్‌పై 1.5 శాతం మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేశాయి. ఇందుకు సానుకూలంగా లేని ప్రభుత్వం... నిర్వహణ బాధ్యతలను చూడా లని జెన్కోను సంప్రదించింది. అయితే సరిపడనంత సిబ్బంది లేనందున ఈ ప్రక్రియపై జెన్కో వెనుకడుగు వేసింది.
దీంతో ప్రస్తుతం కాంట్రాక్టు సంస్థల గడువు ముగిసిన 12 ఎత్తిపోతల పథకాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు నీటిపారుదల శాఖ అధికారులతో శనివారం సచివాయంలో సమీక్షించారు. ప్రైవేటు ఏజె న్సీలకే నిర్వహణ అప్పగించాలని సమావేశం లో నిర్ణయించారు. వీలైనంత త్వరగా టెం డర్ల ప్రక్రియపై మార్గదర్శకాలు రూపొందిం చి చీఫ్ ఇంజనీర్లకు పంపాలని సమావేశంలో నిర్ణయించాయి.