Lily James
-
'నా బెడ్రూం నిండా ఆయన ఫొటోలే'
లండన్: యవ్వనప్రాయం ఎన్నో ఆకర్షణలు, మోహాలతో నిండి ఉంటుంది. యుక్తవయస్సులో కలిగే అలాంటి ఆకర్షణలకు, మోహాలకు తాను కూడా అతీతం కాదని అంటోంది హాలీవుడ్ బ్యూటీ లిల్లీ జేమ్స్. టీనేజ్ప్రాయంలో తాను ర్యాన్ ఫిలిప్ అంటే పడిచచ్చిపోయేదానన్ని, తన పడక గది నిండా ఆయన ఫొటోలే ఉండేవని చెప్తోంది. ప్రైడ్ అండ్ ప్రిజుడిస్, జాంబీస్ వంటి సినిమాలతో ప్రేక్షకులకు చేరువైన ఈ భామ ప్రస్తుతం మ్యాత్ స్మిథ్తో డేటింగ్ చేస్తోంది. 'క్రూయెల్ ఇంటెన్షన్' సినిమాతో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిన ర్యాన్ అంటే తన యవ్వనప్రాయంలో విపరీతమైన ప్రేమ ఉండేదని లిల్లీ తెలిపింది. 'నా బెడ్రూమ్ నిండా ఆయన ఫొటోలే ఉండేవి. నేను ఆయనను ఎంతగా ప్రేమించానంటే అతని చిన్నచిన్న ఫొటోలన్నీ కలిపి ఓ పెద్ద పోస్టర్ చేసుకొని నా గదిలో అతికించుకున్నా' అని ఈ భామ 'ఫిమెల్ ఫస్ట్'తో తెలిపింది. -
ఈ ప్రశ్నలేంటిరా బాబూ!
అస్తమానం అడిగిందే అడిగుతుంటే మొదట బోర్ కొడుతుంది. ఆపై ఆ అడిగినవారినీ ఏదో చేయాలన్నంత కోపం వస్తుంది. కామన్ మ్యానే కాదు... నలుగురిలో తిరిగే సెలబ్రిటీలకైనా ఈ టెంపర్మెంట్లో పెద్దగా తేడా ఉండదని చూపించింది హాలీవుడ్ హాట్ బ్యూటీ లిలీ జేమ్స్. వాల్డ్ డిస్నీ పిక్చర్స్ ‘సిండెరెల్లా’లో నటించిన ఈ స్వీటీ ఒంపుసొంపులపై ఇప్పటికే విపరీతమైన చర్చలు నడిచాయి. ప్రత్యేకించి ఈ చిన్నదాని చిట్టి నడుముపై ఎందరో మనసు పారేసుకున్నారు కూడా. రీసెంట్గా ‘సిండెరెల్లా’ ప్రమోషన్ టూర్కు వెళ్లిన ఈ బ్రిటీష్ బ్యూటీకి మళ్లీ అదే ప్రశ్న ఎదురైంది... మీ సూపర్ ఫిగర్ సీక్రెట్ ఏంటని! దెబ్బకు చిర్రెత్తిన అమ్మడు... ‘నా బాడీపై ఇక ప్రశ్నలు ఆపండి. వినివిని అలసిపోయా. మహిళలను ఎప్పుడూ అదే దృష్టితో చూస్తారెందుకు’ అంటూ ఫైరైపోయింది సదరు ఔత్సాహికులపై!