lingadahal
-
భార్యావియోగం తట్టుకోలేక..
బొమ్మనహాళ్ (రాయదుర్గం) : భార్య వియోగంతో జీవితంపై విరక్తిచెందిన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏఎస్ఐ బషీర్ఖాన్ తెలిపిన మేరకు.. బొమ్మనహాళ్ మండలం లింగదహాళ్కు చెందిన బోయ కృష్ణ (35) భార్య రెండు నెలల కిందట చనిపోయింది. అప్పటి నుంచి దిగాలుగా ఉండేవాడు. సోమవారం తెల్లవారుజామున బహిర్భూమికని వెళ్లి అక్కడే చెట్టుకు ఉరి వేసుకుని అర్ధంతరంగా తనువు చాలించాడు. వీరి ఇద్దరు కుమారులు అనాథలయ్యారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జొన్న ఇగురు తిని 60 గొర్రెలు మృత్యువాత
బొమ్మనహాళ్ : బొమ్మనహాళ్ మండలం ఉద్దేహళ్ సమీపంలోని వేదావతి-హగరి దగ్గర గల జొన్న ఇగురు తిని 60 గొర్రెలు గురువారం మృతి చెందినట్లు ఇదే మండలం లింగదహళ్ గ్రామానికి చెందిన కాపరులు ఈరన్న, బొమ్మన్న, కృష్ణ, తిప్పయ్య తెలిపారు. సమాచారం అందిన వెంటనే పశువైద్యాధికారి డాక్టర్ సుమన్ అక్కడికి చేరుకున్నారు. అస్వస్థతకు గురైన గొర్రెలకు చికిత్స చేశారు. -
వివాహిత ఆత్మహత్య
బొమ్మనహాళ్ (రాయదుర్గం) : బొమ్మనహాళ్ మండలం లింగదహాళ్ గ్రామానికి చెందిన బోయ రేణుకమ్మ (35) శనివారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి అన్న యల్లప్ప ఫిర్యాదు మేరకు ఎస్ఐ శ్రీరాంశ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. బోయ రేణుకమ్మకు లింగదహాళ్ బోయ కృష్ణయ్యతో 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. మూడేళ్లుగా భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లోనే చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.