'ఆ కళాశాలలపై చర్యలు తీసుకోవాలి'
కార్పొరేటర్ కళాశాలలు ఇంటర్‌బోర్డు నిబంధనలను తుంగలో తోక్కుతూ వేసవి తరగతులను నిర్వహిస్తున్నాయని తెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.లింగస్వామి అన్నారు. ఎల్బీనగర్లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ ... కార్పొరేట్ కళాశాలలు ఎంసెట్ పేరుతో వేసవి తరగతును నిర్వహిస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు. నిబంధనలు పాటించని కళాశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.