హోటల్ గదిలో టీవీ నటి సూసైడ్
ప్రముఖ టీవీ నటి లిసా లిన్ మాస్టర్స్ తన హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది. పెరూ రాజధాని లిమాలోని న్యూవో ముండా హోటల్లో మంగళవారం రాత్రి ఆమె విగతజీవిగా ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. మోడలింగ్ ట్రిప్ కోసం పెరూకు వచ్చిన 52 ఏళ్ల లిసా స్కర్ట్‌తో ఉరేసుకొని మృతిచెందడాన్ని మొదట హోటల్ సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
లిసా కొంతకాలంగా మానసిక కుంగుబాటుతో సతమతమవుతున్నదని, ఇందుకోసం చికిత్స పొందుతున్న ఆమె బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని పోలీసులు తెలిపారు. లిసా పలు సూపర్ హిట్ టీవీషోల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. అన్బ్రేకబుల్ కిమ్మీ షుమిడ్ట్, లా అండ్ ఆర్డర్: స్పెషల్ విక్టిమ్స్ యూనిట్, అగ్లీ బెట్టీ, గాసిప్ గర్ల్ వంటి టాప్ టీవీ షోల్లో ఆమె నటించింది.