షాపింగ్ మాల్ షాకింగ్ వీడియో
అప్పటిదాకా తండ్రితో కలిసి నవ్వుతూ వచ్చిన చిన్నారిని.. తెలియకుండానే మృత్యుద్వారంగుండా నడిచింది. మందమైన భారీ గాజు తలుపు ఒక్కసారిగా మీదపడటంతో కుప్పకూలిపోయింది. సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోన్న ఈ షాకింగ్ వీడియో వివరాల్లోకి వెళితే..
చైనాలో చోటుచేసుకున్న ఈ ఘటన తాలూకు వీడియో.. ప్రఖ్యాత వీడియో షేరింగ్ వెబ్ సైట్ 'లైవ్ లీక్' లో సోమవారం మధ్యాహ్నం పోస్ట్ అయింది. ఒకచేతిలో ఏవో సామాన్లు పట్టుకున్న ఆ పాప తండ్రి(లేదా సంరక్షకుడు) మరో చేత్తో తలుపు తెరిచి లోపలికి ప్రవేశించాడు. అతని వెనకే నడుస్తోన్న రెండేళ్ల పాపపై అకస్మాత్తుగా డోర్ పడింది. చైనాలో రద్దీగా ఉండే షాపింగ్ మాల్స్ లో ఇలాంటి సంఘటనలు ఇంతకుముందు కూడా చోటుచేసుకున్నాయి. తాజా ఘటనలో తీవ్రంగా గాయపడ్డ చిన్నారిపాప బతికేఉందా? చనిపోయిందా? అనేది తెలియరాలేదు.