లివ్ లైఫ్‌లో.. న్యూ లైఫ్
సిటీబ్యూరో: ఊబకాయంతో బాధపడుతున్న ఓ నిరుపేద యువకుడికి లివ్ లైఫ్ ఆస్పత్రిలో ఉచితంగా వైద్యం అందించి వైద్యులు ఉదారతను చాటుకున్నారు. అనంతపురం జిల్లా తలుపుల మండలం వేపమానిపేటకు చెందిన మహేష్(20) వృత్తిరీత్యా ఆటో డ్రైవర్. ఈయన కొంత కాలంగా అధిక బరువు సమస్యతో బాధపడుతున్నాడు. ఇతని బాధ చూసి కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ చలించిపోయాడు.
మహేష్‌ను వెంటతీసుకుని లివ్లైఫ్ ఆస్పత్రికి చెందిన కొవ్వు కరిగింపు నిపుణుడు డాక్టర్ నందకిషోర్‌ను సంప్రదించారు. ఆయన ఉచితంగా వైద్యం చేసేందుకు అంగీకరించారు. ల్యాప్రోస్కోపీ ద్వారా కేవలం నెల రోజుల వ్యవధిలోనే 25 కేజీల బరువు తగ్గించి మహేశ్ జీవితకాలాన్ని పెంచారు. దశలవారీగా మరికొంత బరువు తగ్గిస్తామని నందకిషోర్ తెలిపారు.