లోకల్ ఆటోలో...
సజీవ్, రాజు, లావాణ్యరావ్, టీనా రాథోడ్ ముఖ్య తారలుగా న్యూ టాలెంట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నందు జెన్న దర్శకత్వంలో శ్రీసాయి గణేశ్ నిర్మిస్తున్న చిత్రం ‘లోకల్ ఆటో’. మంగళవారం ఈ చిత్రం పూజా కార్యక్రమాలను వ్యాపారవేత్త ఆంజనేయ రాజు వైష్ణవి రికార్డింగ్ థియేటర్లో నిర్వహించారు.
ప్రేమ, మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. నిర్మాత మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు 18 సినిమాలను నిర్మించిన నేను భవిష్యత్‌లో కూడా చిన్న చిత్రాలనే నిర్మించాలనుకుంటున్నాను. వచ్చే నెల 2న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, 25 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘లోకల్ ఆటోలో ఏం జరిగిందనేది ఆసక్తిగా ఉంటుంది. రెండు యువ జంటల మధ్య ఆసక్తికరమైన సంఘటనల నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కించనున్నాం’’ అన్నారు నందు జెన్న. ఈ చిత్రానికి సంగీతం: వినయ్ బాలాజీ.