‘బొమ్మా’ అదుర్స్..
స్థానిక బొమ్మా ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి నెలకొంది. బొమ్మా కాలేజీ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)-16 పేరుతో నిర్వహించిన జాతీయ సాంకేతిక ఫెస్ట్ ముగింపు వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక, ఇతర కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు పలు విభాగాల్లో ప్రదర్శనలిచ్చారు. షార్ట్‌ఫిల్మ్, రంగోలి, మోహందీ పోటీలు పెట్టారు. విద్యార్థులు డ్యాన్స్‌లతో అదుర్స్ అనిపించారు. పాశ్చాత్య, జానపదం, సినీగేయాలతో అలరించారు. పాటలు, మిమీక్రీలో ప్రతిభ చాటారు.
జేఎన్టీయూహెచ్ మాజీ రిజిస్ట్రార్ రమణారావు హాజరై మాట్లాడుతూ..టెక్నికల్ విద్యకు అత్యంత ప్రాముఖ్యత ఉందని, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రణాళిక, పట్టుదలతో ప్రయత్నించి లక్ష్య సాధనలో విజయం సాధించాలన్నారు. పేపర్, పోస్టర్ ప్రజంటేషన్, స్పార్క్సైన్స్ విభాగాల్లో విజేతలకు నగదు ప్రోత్సాహకాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో బొమ్మా విద్యాసంస్థల చైర్మన్ రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ సత్యప్రసాద్, కార్యదర్శి శ్రీధర్, ప్రిన్సిపాల్ మనోజ్‌కుమార్, వర్మ, ఫార్మసీ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, మురళీ కృష్ణ, అధ్యాపకులు పాల్గొన్నారు.