ఫిల్మ్ ఫెస్టివల్లో షారూఖ్ సందడి.. హీరో తీరుపై నెటిజన్స్ ఫైర్!
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ తాజాగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రతిష్టాత్మక లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్ ఈవెంట్లో ఆయన సందడి చేశారు. ఈ సందర్భంగా లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. పార్డో అల్లా కారియేరా అస్కోనా-లోకార్నో టూరిజం అవార్డును అందుకున్నారు. ఈ ఘనత సొంతం చేసుకున్న తొలి భారతీయ నటుడిగా బాలీవుడ్ బాద్షా నిలిచారు. అయితే ఈవెంట్ పాల్గొన్న తన కెరీర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మహిళలను డీగ్రేడ్ చేసి చూపించే చిత్రాల్లో నటించడం తనకు ఇష్టముండదని చెప్పారు.అయితే ఈవెంట్లో బాలీవుడ్ బాద్షా చేసిన పనికి విమర్శలు ఎదుర్కొంటున్నారు. వేదికపై ఉన్న ఓ పెద్దాయనను పక్కకు తోసివేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన కొందరు నెటిజన్స్ షారూఖ్ తీరును తప్పుబడుతున్నారు. ఇలాంటి ప్రవర్తన సరికాదని కామెంట్స్ చేస్తున్నారు. సెలబ్రిటీ అయి ఉండి ఓ పెద్దాయనతో ఇలా ప్రవర్తించడమేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే షారూక్ కావాలని అలా చేయలేదని.. ఏదో సరదాగా అలా చేశారని కింగ్ ఖాన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.ఇక సినిమాల విషయానికొస్తే బాలీవుడ్ బాద్షా చివరిసారిగా డుంకీ చిత్రంలో కనిపించారు. రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో తాప్సీ, విక్కీ కౌశల్ కీలక పాత్రలు పోషించారు. గతేడాది డిసెంబర్లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేకపోయింది. . #ShahRukhKhan he pushed that old man!!! Shame on you @iamsrk pic.twitter.com/eA1g3G66xb— Azzmin✨ SIKANDAR🗿 (@being_azmin) August 10, 2024