ఆజా.. ఆజా.. లాడ్ బజార్
రంజాన్ సమీపిస్తోంది. పాతబస్తీలో సందడి పెరిగింది. గాజుల కొనుగోళ్లతో లాడ్ బజార్ గలగలలాడుతోంది. చిన్నా..పెద్దా షాపింగ్ సందడితో గల్లీలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. కొత్త దుస్తులు, గాజులు, చెప్పులు, వాచీలు, హ్యాండ్బ్యాగులు, అలంకరణ వస్తువులకు గిరాకీ పెరిగింది.
షీర్కుర్మాకు ఉపయోగించే సేమియాలు పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. ఇకరంజాన్ మాసంలో చివరిది కావడంతో శుక్రవారం చార్మినార్, మక్కామసీద్, మదీనా తదితర ప్రాంతాల్లో భారీ ఎత్తున ముస్లింలు సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు.