లోక్సభలో నిద్రపోయిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ రోజు లోక్సభలో ఆవలింతలు - కునికిపాట్లు - ఆ తరువాత ఘాడ నిద్రలోకి వెళ్లిపోయారు. సభలో ఓవైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలపై పెద్ద ఎత్తున చర్చ జరిగే సమయంలో ఆయన ఈ విధంగా నిద్రపోయారు. నిద్రపోతూ ఆయన టివి కెమెరాకు కూడా చిక్కారు.
ఇది గమనించిన మిగతా కాంగ్రెస్ ఎంపీలు ఆయనను నిద్ర నుంచి మేల్కొలిపే ప్రయత్నం చేశారు. ఫలితంలేకుండా పోయింది. అంతలోనే నిద్రపోతున్న దృశ్యాలు మీడియాకెక్కాయి. రాహుల్ తీరును అధికార బిజెపి సభ్యులు విమర్శించారు. .