ఆనంద్ గేమ్ డ్రా
లండన్ మాజీ ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ లండన్ చెస్ క్లాసిక్ టోర్నమెంట్లో ఎట్టకేలకు తన పరాజయాల పరంపరకు ముగింపు పలికాడు. వరుస మూడు ఓటముల అనంతరం జరిగిన నాలో గేమ్ ను ఆనంద్ డ్రా చేసుకున్నాడు. ఆదివారం ఫబియానో కరునా(అమెరికా)తో జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్ లో ఆనంద్ డ్రాతో సంతృప్తి చెందాడు.
దీంతో ఎనిమిదో రౌండ్ ముగిసిన అనంతరం మూడు పాయింట్లతో ఆనంద్ తొమ్మిది స్థానంలో కొనసాగుతుండగా, 3.5 పాయింట్లతో నకమురా ఎనిమిదో స్థానంలో నిలిచాడు. కాగా, 5.0 పాయింట్లతో హాలెండ్ ఆటగాడు అనిష్ గిరి , మాక్సిమి వాచిర్ లాగ్రెవ్ తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో ఆనంద్ ప్రదర్శన సంతృప్తికరంగా సాగడం లేదు.