రెండు షర్ట్లు ఒక డిజైన్
న్యూలుక్
షార్ట్ స్లీవ్స్, లాంగ్ స్లీవ్స్, కాలర్ నెక్, రౌండ్ నెక్.. ఇలా టీ షర్ట్స్ అన్నీ ఇంచుమించు ఈ రెండు డిజైన్లలోనే కనిపిస్తాయి. వాటినే తరచూ ధరించాలంటే విసుగ్గా అనిపిస్తుంటుంది. ఒక ఆలోచన చేస్తే.. ఒక టీషర్ట్, మరో షర్ట్‌ని కలిపితే ఆకర్షణీయమైన డిజైనరీ డ్రెస్ మీ ముందుంటుంది.ప్లెయిన్ లాంగ్ స్లీవ్స్ టీ షర్ట్ ఒకటి తీసుకోవాలి. చిన్న చిన్న ప్రింట్లు, చెక్స్ ఉన్నవి కూడా బాగుంటాయి. మరో ప్లెయిన్ లేదా చెక్స్ షర్ట్ తీసుకోవాలి.
షర్ట్ కాలర్ బాగం 5 ఇంచుల వెడల్పు ఉండేలా బటన్స్ భాగమంతా కట్ చేయాలి. అలాగే హ్యాండ్ కఫ్స్ కూడా! టీ షర్ట్ మధ్య భాగం నెక్ నుంచి కిందవరకు కట్ చేయాలి. కట్ చేసిన షర్ట్ భాగాన్ని టీ షర్ట్‌కు జత చేసి కుట్టాలి.షోల్డర్ కఫ్స్, హ్యాండ్ కఫ్స్ కూడా జత చేయాలి.దీంతో టీ షర్ట్ ఒక కొత్త మోడల్లో కనువిందు చేస్తుంటుంది. ఇన్నర్‌గా ట్యునిక్ ధరించి, ఆ పైన టీ షర్ట్‌తో ఇలా డిజైన్ చేసిన ఓపెన్ షర్ట్‌ని ధరించవచ్చు. స్టైల్‌గా మెరిసిపోవచ్చు.మిగిలిన షర్ట్ క్లాత్‌తో ఏం చేయవచ్చో మీ మెదడుకు పని చెప్పండి.