రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
చింతలపూడి : చింతలపూడి మండలం లింగగూడెం సమీపంలో శుక్రవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాఘవాపురం గ్రామానికి చెందిన సిద్దోజీ పుల్లాచారి (55) కోళ్ల వ్యర్థాలు తీసుకువెళ్తున్న డీసీఎం వాహనం డ్రైవర్‌తో మాట్లాడుతుండగా తెలంగాణ రాష్ట్రం వైపు నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో పుల్లాచారి అక్కడికక్కడే మృతిచెందారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్సై సైదానాయక్ మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పుల్లాచారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.