రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి
వైఎస్సార్ జిల్లా(కడప): కడప పట్టణం సమీపంలో గురువారం ఉదయం 11గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. నగరంలోని సబ్‌జైల్ ప్రాంతానికి చెందిన హరి(35) ఐషర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడు తన వాహనంలో వెళ్తుండగా ఒంటిమిట్ట ఎదురుగా వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. దీంతో హరి అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.