Lorry roll
-
లారీ బోల్తా..ఇద్దరు మృత్యువాత
ఉంగుటూరు: పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం తల్లాపురం సమీపంలో బుధవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. చేపలలోడుతో తల్లాపురం వైపు వెళ్తున్న లారీ అదుపు తప్పి పంటపొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. దీంతో లారీ డ్రైవర్, క్లీనర్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే చనిపోగా మరో ఏడుగురు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. -
లారీ బోల్తా: ఇద్దరికి గాయాలు
రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని కొంతమూరు వద్ద మంగళవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఇద్దరు గాయాల పాలయ్యారు. పోర్టు రోడ్డులోని గామన్ వంతెన లారీ బోల్తా పడగా డ్రైవర్, క్లీనర్ క్యాబిన్లో ఇరుక్కుపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలికి చేరుకున్నారు. క్రేన్‌ను తెప్పించి డ్రైవర్, క్లీనర్‌ను బయటకు తీశారు. గాయపడిన ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. -
లారీ బోల్తా.. క్లీనర్ మృతి
కూడేరు: వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టడంతో.. లారీ క్లీనర్ మృతిచెందగా డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతపురం జిల్లా కూడేరు మండలం జెల్లిపల్లి గ్రామ శివారులో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. అనంతపురం నుంచి బళ్లారి వెళ్తున్న గాలి మరల లారీ జెల్లిపల్లి గ్రామ శివారులోని మూల మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో తమిళనాడు రాష్ట్రంలోని కాంచిపురంకు చెందిన లారీ క్లీనర్ శంకర్(25) అక్కడికక్కడే మృతిచెందగా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
కూలి పనికి వెళ్లి అనంత లోకాలకు..
పెదకాపవరం (ఆకివీడు) : ఐస్ లోడుతో వెళుతున్న లారీ బోల్తా కొట్టడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయూలయ్యూరుు. లారీ క్యాబిన్లో ప్రయూణిస్తున్న చేపల ప్యాకింగ్ కార్మికుడు గోడి రమణ (40) అక్కడికక్కడే మృతిచెందగా బోనుల జార్జి (50), పితాని శ్రీను (35) అనే కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. లారీ తిరగబడటంతో క్యాబిన్లో చిక్కుకుపోరుున రమణ కొద్దిసేపు మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచాడు. రమణ ను కాపాడేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యూరుు. ఆకివీడు మండలం పెదకాపవరంలో వెంకయ్య వయ్యేరు కాలువ వంతెన వద్ద జరిగిన ఈ విషాద ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గణపవరం నుంచి లారీలో ప్యాకింగ్ కూలీలను ఎక్కించుకు ని ఐస్ లోడు, చేపల ట్రేలతో డ్రైవర్ పెదకాపవరంలో ఓ చెరువు వద్దకు వెళ్లాడు. కొన్ని కారణాల వల్ల చేపల పట్టుబడి నిలిచిపోవడంతో వీరంతా అదే లారీలో తిరుగు ప్రయూణమయ్యూరు. పెదకాపవరంలో వెంకయ్య వయ్యేరు వంతెనపైకి వచ్చేసరికి లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేసి నిలిపివేశాడు. ఐదు నిమిషాల తర్వాత వంతెనపై నుంచి లారీ పక్కకు ఒరగడం మొదలైంది. దీనిని గమనించిన లారీపై ఉన్న కూలీలు, డ్రైవర్ కిందకు దూకేశారు. కొద్ది సేపటికి వంతెన పక్కనున్న రోడ్డుపైన లారీ తిరగబడింది. దీంతో లారీ క్యాబిన్లో చిక్కుకుపోరుున కార్మికుడు రమణ శరీరం నుజ్జునుజ్జుకాగా జార్జి కుడి కాలు, శ్రీను ఎడమ కాలుకు తీవ్రగాయూలయ్యూరుు. ఆక్రందనలు చేస్తూ కన్నుమూత లారీ బోల్తా కొట్టిన వెంటనే స్థానికులు స్పందించి చేపల ట్రేలను, ఐస్‌ను కిందకు దించారు. క్యాబిన్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. తీవ్రగాయూలైన రమణ రక్షించండంటూ ఆక్రందనలు చేస్తూ కన్నుమూశాడు. జార్జి, శ్రీనును బయటకు తీసిన స్థానికులు భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఉండి మండలం వెలివర్రు గ్రామానికి చెందిన రమణకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తహసిల్దార్ వి.నాగార్జునరెడ్డి, ఎస్సై కె.అశోక్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు, ఏ ఎంసీ చైర్మన్లు మోటుపల్లి రామవరప్రసా ద్, కొత్తపల్లి గోపాలకృష్ణంరాజు, గ్రామ పెద్ద తోట ఏడుకొండలు, సర్పంచ్ లం బాడి మురళీ వెంకటలక్ష్మి, ఎంపీటీసీ మందలంక జాన్ వెస్లీ తదితరులు పరి శీలించి బాధితులను పరామర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాకు దిక్కెవరు నాన్నా ‘నాన్నా.. వెళ్లిపోయూవా.. ఇక మాకు దిక్కెవరు’ అంటూ మృతుని కుమార్తె శాంతి, భార్య మాణిక్యం రోదనలు మి న్నంటారుు. కొద్దిసేపు కన్నీరుమున్నీరైన శాంతి స్పృహ తప్పి పడిపోవడంతో ఆమెను చికిత్స కోసం అంబులెన్సులో తరలించారు. ఘటనా స్థలం వద్ద రమణ బంధువులు, కుటుంబ సభ్యులు రోదిం చిన తీరు కన్నీళ్లు తెప్పించింది. వెలివై లో విషాదఛాయలు అలముకున్నాయి. -
అర్ధరాత్రి.. కాళరాత్రి!
⇒పెళ్లి బృందం లారీ బోల్తా ఘటనలో ఆరుకు చేరిన మృతుల సంఖ్య ⇒వివిధ వైద్యశాలల్లో చికిత్స పొందుతున్న 31 మంది క్షతగాత్రులు ⇒సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ముత్తుముల, జేసీ ⇒మృతుల బంధువులు, క్షతగాత్రులకు ఓదార్పు గిద్దలూరు : పెళ్లి బృందం లారీ బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరుకుంది. 31 మంది క్షతగాత్రులు వివిధ వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రకాశం- కర్నాలు జిల్లా సరిహద్దులోని నలమల అటవీ ప్రాంతంలో పాత రైల్వే బ్రిడ్జి వద్ద పెళ్లి బృందం లారీ శుక్రవారం అర్ధరాత్రి బోల్తా పడిన విషయం తెలిసిందే. మృతులు, క్షతగాత్రుల స్వగ్రామం నగర పంచాయతీ పరిధిలోని చట్రెడ్డిపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో 11 మంది, అక్కడి ప్రైవేటు వైద్యశాలలో ఒకరు, నంద్యాలలో ముగ్గురు, ఒంగోలులో ఒకరు, నరసరావుపేటలో ముగ్గురు, గిద్దలూరులోని డీజీఆర్ వైద్యశాలలో ఏడుగురు, ఆరోగ్యశ్రీ, ఏరియా వైద్యశాలలో ఆరుగురు క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. వీరిలో కర్నూలు, నరసరావుపేటల్లో చికిత్స పొందుతున్న ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు వీరే.. చట్రెడ్డిపల్లెకు చెందిన తిరుపాలు (55), ప్రభాకర్(33), ఏసోబు(39), బోయలకుంట్లకు చెందిన ఉడుముల జయమ్మ (45)లు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. చట్రెడ్డిపల్లెకు చెందిన గడ్డం వెంకటయ్య(34), మొలక కృష్ణ(20)లు గిద్దలూరులోని వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల కుటుంబ సభ్యులు, క్షతగాత్రులను ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ యాకూబ్‌నాయక్, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుతో పాటు పలువురు నాయకులు శనివారం పరామర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న ముత్తుముల విషయం తెలుసుకుని వెంటనే కర్నూలు వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న 12 మందిని పరామర్శించారు. అనంతరం నంద్యాలలో పలు వైద్యశాల్లో చికిత్సలు పొందుతున్న ముగ్గురిని పరామర్శించారు. మృతదేహాలను త్వరగా బంధువులకు అప్పగించాలని వైద్యులను కోరారు. అనంతరం సంఘటన స్థలానికి వెళ్లి లారీని పరిశీలించారు. స్థానికుల నుంచి ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకున్నారు. గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాల, డీజీఆర్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వైద్యం అందుతున్న తీరును డాక్టర్ సూరిబాబు, డాక్టర్ హరనాథరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ప్రైవేట్ వైద్యశాలల్లో చికిత్స పొందుతున్న వారిని తక్షణమే ప్రభుత్వ వైద్యశాలకు మార్చాలని ఆర్డీఓ చంద్రశేఖరరావును జేసీ ఆదేశించారు. ఎంపీపీ కడప వంశీధరరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధులు సూరా స్వామిరంగారెడ్డి, దప్పిలి రాజేంద్రప్రసాద్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ కాకునూరి హిమశేఖరరెడ్డి, పట్టణ కన్వీనర్ మోపూరి బ్రహ్మం, నాయకులు రెడ్డి కాశిరెడ్డి, సీవీఎన్ ప్రసాద్, దప్పిలి కాశిరెడ్డి, దమ్మాల జనార్దన్, వైజా కృష్ణారెడ్డి, బొర్రా కృష్ణారెడ్డి క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు సాయం రూ.లక్ష మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ యాకూబ్‌నాయక్ శనివారం గిద్దలూరు వచ్చి ప్రభుత్వం తరఫున సాయం ప్రకటించారు. స్థానిక ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్‌రెడ్డి రూ. 20 వేలు చొప్పున సాయం చేయనున్నట్లు చెప్పారు. రాచర్ల ఎంపీపీ రెడ్డి లక్ష్మీదేవి, వైఎస్సార్సీపీ నాయకులు రెడ్డి కాశిరెడ్డిలు ఒక్కో కుటుంబానికి రూ.5 వేలు చొప్పున ఆర్థిక సాయం చేసేందుకు అంగీకరించారు. క్షతగాత్రులకూ ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలి : ముత్తుముల లారీ ప్రమాదంలో గాయపడిన వారికి కూడా ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని జాయింట్ కలెక్టర్ యాకూబ్నాయక్ను ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి కోరారు. కలెక్టర్‌తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని జేసీ చెప్పారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పెంచేలా అసెంబ్లీలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాననిహామీ ఇచ్చారు. ఒంగోలు టౌన్ : పెళ్లి బృందం లారీ బోల్తాపడిన ఘటనలో మృతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియో మంజూరు చేసినట్లు కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారు గిద్దలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు.