దైవానికీ... దెయ్యానికీ..
మురళీకృష్ణ, భానుశ్రీ, ఐశ్వర్య ప్రధాన పాత్రల్లో లాస్ ఏంజిల్స్ టాకీస్ పతాకంపై కిషన్ సాగర్ దర్శకత్వంలో అల్లూరి సూర్య ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘మౌనం’. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇదొక డిఫరెంట్ హారర్ మూవీ. దైవానికి, దెయ్యానికి మధ్య ఉన్న తేడాను ఇందులో చూపిస్తున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ఎంఎం శ్రీలేఖ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బలుసు రామారావు, కెమేరా: కిషన్ సాగర్ ఎస్, సమర్పణ: సంధ్యా మోషన్ పిక్చర్స్.