రాయితీలపై రైల్వేల నష్టం ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వేస్ రాయితీల కారణంగా కోట్ల రూపాయల ఆదాయాన్ని నష్టపోయింది. ప్రయాణీకుల చార్జీల్లో ఇచ్చిన వివిధ రకాల రాయితీల కారణంగా 2015-16 సం.రంలో రూ 1,602 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని రైల్వే శాఖ సహాయ మంత్రి రాజెన్ గోహైన్ రాజ్యసభలో శుక్రవారం చెప్పారు.
సీనియర్ సిటిజెన్, రోగులు, ఫిజికల్లీ ఛాలెంజెడ్ పీపుల్, ఇజ్జత్ పథకం కింద నెలవారీ సీజన్ టిక్కెట్లలో ఇచ్చిన కన్సెషన్ కారణంగా ఈ ఆదాయాన్ని కోల్పోయినట్టు సభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో మంత్రి ప్రకటించారు. యుద్ధం వితంతువులు, పత్రికా ప్రతినిధులు, అవార్డు గ్రహీత ఉపాధ్యాయులు, ప్రధాని శ్రమ అవార్డు గ్రహీతలు, ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ అవార్డు గ్రహీతలు తదితర 24 కేటగిరీల లో భారతీయ రైల్వే ఛార్జీల రాయితీని కల్పిస్తోంది.