ఎస్సారెస్పీకి పెరుగుతున్న నీటిమట్టం
జగిత్యాల అగ్రికల్చర్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్ట్‌లోకి వరద పెరుగుతోంది. ఎస్సారెస్పీ ప్రాజెక్టు సామర్థ్యం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1076.10 అడుగులకు చేరింది. ఇన్‌ఫ్లో 54 వేల క్యూసెక్కులు ఉంది. అంతేకాకుండా మహారాష్ట్రలోని విష్ణుపురి ప్రాజెక్ట్ నుంచి 1.50 లక్షల క్యూసెక్కుల నీరు శనివారం రాత్రి విడుదలయ్యే అవకాశం ఉంది.